కారును ఢీకొన్న డీసీఎం వ్యాను.. ఐదుగురికి గాయాలు

ABN , First Publish Date - 2021-08-27T05:30:00+05:30 IST

మండలంలోని మేదినీపూర్‌ స్టేజీ వద్ద రాజీవ్‌ రహదారిపై శుక్రవారం కారును డీసీఎం వ్యాను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కారును ఢీకొన్న డీసీఎం వ్యాను.. ఐదుగురికి గాయాలు
ప్రమాదానికి గురైన కారు

కొండపాక, ఆగస్టు 27: మండలంలోని మేదినీపూర్‌ స్టేజీ వద్ద రాజీవ్‌ రహదారిపై శుక్రవారం కారును డీసీఎం వ్యాను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న కారును మేదినీపూర్‌ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. స్వామి అనే వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొంది పెద్దపల్లికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిలో కావేటి శ్రీకాంత్‌, శివ, శిరీష, ప్రశాంతి, స్వామి ఉన్నారు. సమాచారమందుకున్న 108 సిబ్బంది వెంటనే చేరుకుని క్షతగాత్రులను సిద్దిపేట ఆస్పత్రిలో చేర్పించారు. 

Updated Date - 2021-08-27T05:30:00+05:30 IST