గ్రామాభివృద్ధిపై విమర్శలా?
ABN , First Publish Date - 2021-10-29T04:51:59+05:30 IST
నిజాంపేట మండల పరిధి నార్లాపూర్ గ్రామ సర్పంచ్ అమరసేనారెడ్డి గురువారం గ్రామం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.

200ల మందితో నార్లాపూర్ సర్పంచ్ పాదయాత్ర
నిజాంపేట, అక్టోబరు 28 : నిజాంపేట మండల పరిధి నార్లాపూర్ గ్రామ సర్పంచ్ అమరసేనారెడ్డి గురువారం గ్రామం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ... అవినీతికి పాల్పడుతున్నానని ఎంపీటీసీ, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు తనపై ఎంపీడీవో, అదనపు కలెక్టర్లకు ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తూ సుమారు 200 మందితో పాదయాత్ర నిర్వహించారు. అభివృద్ధి జరగలేదన్న వారితో చర్చకు సిద్ధమన్నారు. లేనిపక్షంలో సంబంధిత వ్యక్తులపై పరువు నష్టం దావాతో పాటు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమరసేనారెడ్డి, వార్డుసభ్యులు కృష్ణారెడ్డి, యాదాగౌడ్, నీలం సుధాకర్, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, భక్తుల రాజయ్య, కమ్మరి బ్రహ్మచారి, బాలయ్య, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.