అన్ని ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-20T06:22:53+05:30 IST

అల్లాదుర్గం, జనవరి 19 : మండలంలోని అన్ని ఆస్పత్రుల్లో కరోనా టీకా వేస్తామని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. మంగళవారం అల్లాదుర్గం, గడిపెద్దాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు.

అన్ని ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్‌
అల్లాదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి పరిశీలిస్తున్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌

 అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

అల్లాదుర్గం, జనవరి 19 : మండలంలోని అన్ని ఆస్పత్రుల్లో కరోనా టీకా వేస్తామని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. మంగళవారం అల్లాదుర్గం, గడిపెద్దాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కరోనా టీకా రాకతో ప్రజల్లో ధైర్యం పెరిగిందని, అయినా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఈర్ల అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కాశీనాథ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ దుర్గారెడ్డి, సర్పంచులు అంజియాదవ్‌, అమ్మాయమ్మ, ఎంపీటీసీ దశరథ్‌ పాల్గొన్నారు. 

 మెదక్‌ అర్బన్‌ : జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 24 కేంద్రాల్లో టీకా వేసే కార్యక్రమం మూడోరోజు వేగంగా సాగింది. మంగళవారం 1561 మందికి టీకా ఇచ్చామని వైద్యాధికారులు తెలిపారు. హవేళీఘణపూర్‌ మండల పరిధిలోని సర్దన పీహెచ్‌సీలో టీకా తీసుకున్న పాతూర్‌కు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ భాగ్యవతి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి వైద్యమందిస్తున్నారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. 

 టేక్మాల్‌ : టేక్మాల్‌ మండంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ను ఎంపీపీ స్వప్న, ప్రాథమిక వైద్యురాలు ఇందిరా మంగళవారం ప్రారంభించారు. తొలిరోజు 61 మంది టీకాను వేయించుకున్నారు. 

 శివ్వంపేట : శివ్వంపేట పీహెచ్‌సీలో మంగళవారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. మొదటిరోజు కార్యక్రమానికి ఎంపీపీ హరికృష్ణ, సర్పంచ్‌ శ్రీనివా్‌సగౌడ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, జడ్పీ కో ఆప్షన్‌ మన్సూర్‌ హాజరయ్యారు. 

 రామాయంపేట : రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం కరోనాటీకాను డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటేశ్వర్‌రావు ప్రారంభించారు. 

 చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండలంలోని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ పంపిణీని ఎంపీపీ భాగ్యలక్ష్మి ప్రారంభించారు. 

 చేగుంట : చేగుంట ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను స్థానిక ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌ ప్రారంభించారు. మొదటి టీకాను ఆస్పత్రి వైద్యుడు వినయ్‌కుమార్‌ తీసుకున్నారు.

 నర్సాపూర్‌ : నర్సాపూర్‌ మండలం రెడ్లిపల్లి పీహెచ్‌సీలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌ను జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి (డీఐవో) డాక్టర్‌ సుమిత్ర పరిశీలించారు. 

 తూప్రాన్‌ : తూప్రాన్‌ పట్టణంలోని సామూహిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో మంగళవారం కరోనా వ్యాక్సినేషన్‌ను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అమర్‌సింగ్‌ ప్రారంభించారు. 

 కొల్చారం : కరోనా టీకాను రంగంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేగమాల సంతోష్‌ ప్రారంభించారు. 

 హవేళీఘణపూర్‌ : మండల పరిధిలోని సర్దన గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేస్తున్న కరోనా వ్యాక్సినేషన్‌ను డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెన్ట్‌ ఊహశ్రీ మంగళవారం పరిశీలించారు. 

 పెద్దశంకరంపేట : పెద్దశంకరంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 72 మందికి టీకా వేసినట్లు మండల వైద్యాధికారి పుష్పలత తెలిపారు. 

 రేగోడు : కరోనా వ్యాక్సినేషన్‌ను రేగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జడ్పీటీసీ యాదగిరి, ఎంపీపీ సరోజన, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌ తదితరులు ప్రారంభించారు. 

Updated Date - 2021-01-20T06:22:53+05:30 IST