రెండు జిల్లాల్లో 416 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-05-03T05:08:18+05:30 IST

జిల్లాలో కొత్తగా 349 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో 349 మందికి కరోనా సోకినట్టు నిర్ధారించారు.

రెండు జిల్లాల్లో 416 మందికి కరోనా

మెదక్‌ జిల్లాలో ఐదుగురు, సంగారెడ్డి జిల్లాలో ఇద్దరి మృతి

సంగారెడ్డి అర్బన్‌, మే 2 : జిల్లాలో కొత్తగా 349 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో 349 మందికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. పటాన్‌చెరు-70, నారాయణఖేడ్‌-24, జహీరాబాద్‌-30, జోగిపేట-28, సదాశివపేట-35, అమీన్‌పూర్‌-25, సంగారెడ్డి-60, గుమ్మడిదల-5, దౌల్తాబాద్‌-5, బొల్లారం-5, కంది-5, తాలెల్మ-5, సిరూర్‌-4, పాంపాడ్‌-4, మునిపల్లి-4, పుల్‌కల్‌-4, కర్‌సగుత్తి-4, న్యాల్‌కల్‌-3, బొర్గి-3, కృష్ణాపూర్‌-3, చింతల్‌చెర్వు-3, కల్హేర్‌-2, నాగ్‌దార్‌-2, పుల్‌కుర్తి-2, రాణాపూర్‌-2, తడ్కల్‌-2, కానుకుంట-2, ఎల్గోయ్‌-2, ఆర్సీపురం-6 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌ వచ్చిన 349 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు. అలాగే 2,104 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేశారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిమిత్తం సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రి నుంచి 128 మంది, పటాన్‌చెరు ఆసుపత్రి నుంచి 150 మంది శాంపిళ్లు సేకరించి గాంధీ దవాఖానాకు పంపామని వైధ్యాధికారులు తెలిపారు. కంది పీహెచ్‌సీలో ర్యాపిడ్‌ కిట్లు లేక కరోనా టెస్టులు చేయలేదు. 

మెదక్‌ జిల్లాలో కొత్తగా 67 కేసులు 

మెదక్‌ అర్బన్‌, మే 2: మెదక్‌ జిల్లాలో ఆదివారం 344 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 67 మందికి పాజిటివ్‌ వచ్చింది. తూప్రాన్‌ 17, జిల్లా కేంద్ర ఆసుపత్రి 10, పొడ్చన్‌పల్లి 10, ధర్మారం 6, పెద్దశంకరంపేట 5, రెడ్డిపల్లి 5, టేక్మాల్‌ 4, అల్లాదుర్గం 4, శివ్వంపేట 3, సర్దన 2, పాపన్నపేట 1 చొప్పున కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో  80 మంది గర్భిణులకు టెస్టులు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.

రోజురోజుకూ పెరుగుతున్న మరణాలు

మెదక్‌ అర్బన్‌, మే 2: మెదక్‌ జిల్లాలో కొవిడ్‌ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. గత 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. మెదక్‌ పట్టణంలోని చమన్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డారు. పట్టణానికే చెందిన వ్యక్తి (52) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పెద్దశంకరంపేట మండల పరిధిలోని చిలపల్లి గ్రామానికి చెందిన యువకుడు (33) గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. పాపన్నపేట మండల పరిధిలోని ఽసోమ్లా తండాకు చెందిన 38 ఏళ్ల యువకుడిని మహమ్మారి బలి తీసుకున్నది. జిల్లాలో కరోనాతో ఇప్పటి వరకు 68 మంది మృత్యువాతపడ్డారు. అనధికారికంగా జిల్లాలో మృతి చెందిన వారి సంఖ్య 100 వరకు ఉంటుందని అంచనా.

ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ మృతి

తూప్రాన్‌, మే 2: పట్టణంలోని ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ టీచర్‌ (70) కరోనాతో ఆదివారం మృతి చెందారు. ఆమెకు ఈ నెల 22న పాజిటివ్‌రావడంతో మలక్‌పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. 

కరోనాతో కానిస్టేబుల్‌ మృతి

కంది, మే 2: కరోనా బారినపడి సంగారెడ్డి రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ శనివారం రాత్రి మృతిచెందారు.  ఎస్‌ఐ కే. సుభాష్‌ తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ (44)కు మే 25న కరోనా సోకవడంతో హోంఐసోలేషన్‌లో ఉన్నారు. పరిస్థితి విషమించడంతో మే 29న సంగారెడ్డిలోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం సంగారెడ్డిరూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో డీఎస్పీ బాలాజీ ఆధ్వర్యంలో సీఐ శివలింగం, ఎస్‌ఐలు సభాష్‌, కుర్షీద్‌, సిబ్బంది కానిస్టేబుల్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఉపాధ్యాయుడిని బలితీసుకున్న కరోనా

నారాయణఖేడ్‌, మే 2: నారాయణఖేడ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కరోనాతో మృతిచెందారు. ఖేడ్‌ ఉన్నత పాఠశాలలో సోషల్‌  స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు (35) కరోనా సోకడంతో వారం క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతికి ఉపాధ్యాయ సంఘాలు సంతాపాన్ని తెలిపాయి.

Updated Date - 2021-05-03T05:08:18+05:30 IST