మెదక్‌ జిల్లాలో 260 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-05-08T05:50:59+05:30 IST

మెదక్‌ జిల్లావ్యాప్తంగా శుక్రవారం 759 మందికి కరోనా ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా 260 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో అత్యధికంగా మెదక్‌లో 43 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఇద్దరు గర్భిణులకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

మెదక్‌ జిల్లాలో 260 కరోనా కేసులు నమోదు

మెదక్‌ అర్బన్‌, మే 7: మెదక్‌ జిల్లావ్యాప్తంగా శుక్రవారం 759 మందికి కరోనా ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా 260 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో అత్యధికంగా మెదక్‌లో 43 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఇద్దరు గర్భిణులకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఇప్పటివరకు వైరస్‌ బారినపడినవారి సంఖ్య 11,982కు చేరుకుంది. 6,495 మంది కరోనా నుంచి కోలుకోగా 4,952 మంది హోంఐసోలేషన్‌లో, 88 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో మొత్తం 71 మందిని మహమ్మారి బలి తీసుకుంది.


సంగారెడ్డి జిల్లాలో 199 మందికి కరోనా పాజిటివ్‌

సంగారెడ్డి అర్బన్‌, మే 7: సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 193 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 193 మందికి కరోనా సోకింది. అత్యధికంగా పటాన్‌చెరులో 45 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ వచ్చినవారంతా హోంఐసోలేషన్‌లో ఉన్నారు. మత్తం 857 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేశారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిమిత్తం సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి నుంచి 134, పటాన్‌చెరు ఆస్పత్రి నుంచి 125 శాంపిళ్లు గాంధీ ఆస్పత్రికి పంపినట్టు వైధ్యాధికారులు తెలిపారు.  


సిద్దిపేట జిల్లాలో కరోనాతో 11 మంది మృతి

సిద్దిపేట, మే 7: సిద్దిపేట జిల్లాలో శుక్రవారం కరోనాతో 11 మంది మృతిచెందారు. సిద్దిపేట జీజీహెచ్‌లో నలుగురు, శివాజీనగర్‌కు చెందిన ఒకరు, పటేల్‌పురకు చెందిన ఒకరు, భారత్‌నగర్‌కు చెందిన ఒకరు, రాయపోల్‌లో ఒకరు, తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లిలో ఒకరు, కొండపాకకు చెందిన ఇద్దరు మృతిచెందారు. 


ఓకేరోజు ఆరుగురు..

తూప్రాన్‌, మే 7: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పీహెచ్‌సీ పరిధిలో శుక్రవారం ఒకేరోజు ఆరుగురు వ్యక్తులు కొవిడ్‌–19 బారినపడి మృతిచెందారు. వీరిలో నలుగురు తూప్రాన్‌ పట్టణానికి చెందినవారు. తూప్రాన్‌ పట్టణానికి చెందిన సెక్యూరిటీగార్డు (48) గాంధీ ఆస్పత్రిలో చొకిత్స పొందుతూ మృతిచెందారు. పట్టనానికే చెందిన 60 ఏళ్ల వ్యక్తి హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. మగ్ధుంపూర్‌కు చెందిన మహిళ (50) లక్ష్మక్కపల్లి ఆస్పత్రిలో మృతిచెందారు. తూప్రాన్‌లో నివాసముండే మనోహరాబాద్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన మహిళ (48) హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు, యావాపూర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు.

Updated Date - 2021-05-08T05:50:59+05:30 IST