సునీతాలక్ష్మారెడ్డి కాలనీలో కార్డన్‌ సర్చ్‌

ABN , First Publish Date - 2021-10-29T04:53:17+05:30 IST

నర్సాపూర్‌ సీఐ లింగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో సునీతాలక్ష్మారెడ్డి కాలనీలో గురువారం ఉదయం కార్డన్‌ సర్చ్‌ నిర్వహించి ఇంటింటి తనిఖీలు నిర్వహించారు.

సునీతాలక్ష్మారెడ్డి కాలనీలో కార్డన్‌ సర్చ్‌
తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

సరైన పత్రాలు లేని 11 వాహనాల సీజ్‌

నర్సాపూర్‌,అక్టోబరు 28 : నర్సాపూర్‌ సీఐ లింగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో సునీతాలక్ష్మారెడ్డి కాలనీలో గురువారం ఉదయం కార్డన్‌ సర్చ్‌ నిర్వహించి ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. సీఐతో పాటు ఎస్‌ఐలు గంగరాజు, మల్లారెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, ప్రొబిషనరీ ఎస్‌ఐలు రాయుడు, కృష్ణవేణి, సునీత, లక్ష్మి, ఏఎ్‌సఐ సాయితో పాటు 50 మంది వరకు పోలీసు సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. సీఐ మాట్లాడుతూ ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఈ కార్డన్‌సర్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు. 

Updated Date - 2021-10-29T04:53:17+05:30 IST