తూతూమంత్రంగా సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2021-08-26T03:47:39+05:30 IST

మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ నిర్మల అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా సాగింది.

తూతూమంత్రంగా సర్వసభ్య సమావేశం
మండల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ నిర్మల

 ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు గైర్హాజరు 


బెజ్జంకి, ఆగస్టు 25: మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ నిర్మల అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా సాగింది. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి కొన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరు కాలేదు. దీంతో సమావేశాన్ని మొక్కుబడిగా  నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నిర్మల మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. రైతులు బీమాతో పాటు,  పంటల వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ కవిత, తమసీల్దార్‌ విజయ్‌ప్రకా్‌షరావ్‌, ఎంపీడీవో రాఘవేందర్‌రెడ్డి, ఎంపీఓ మంజుల, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-08-26T03:47:39+05:30 IST