ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ కృషి
ABN , First Publish Date - 2021-03-22T05:26:41+05:30 IST
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తున్నదని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి అన్నారు.

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి
వర్గల్, మార్చి 21 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తున్నదని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి అన్నారు. ఆదివారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వర్గల్ మండలం శాకారం వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మండలంలోని అంబర్‌పేట, వేలూర్, నాచారం, మజీద్‌పల్లి, నెంటూర్ చౌదరిపల్లి, మక్తా, మైలారం మీదుగా వర్గల్ మండల కేంద్రం వరకు 500 ద్విచక్ర వాహనాలతో 50 కిలోమీటర్ల బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆంక్షారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ పోరాటం చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అవినీతి, అక్రమాలు ఎక్కువైపోయాయని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదన్నారు. రానున్న ఎన్నికలలో యూత్ సహకారంతో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామన్నారు. అనంతరం వర్గల్ మండల కేంద్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్, యూత్ మండల అధ్యక్షుడు అనిల్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాయిని యాదగిరి, బాలకృష్ణరెడ్డి, ప్రభుగౌడ్, సర్పంచులు పాల్గొన్నారు.