ఇంట్లో నిల్వ చేసిన గుట్కా పట్టివేత

ABN , First Publish Date - 2021-07-12T05:37:40+05:30 IST

జహీరాబాద్‌లోని నాగులకట్ట వద్ద ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన గుట్కాను పట్టుకున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.

ఇంట్లో నిల్వ చేసిన గుట్కా పట్టివేత

జహీరాబాద్‌, జూలై 11: జహీరాబాద్‌లోని నాగులకట్ట వద్ద ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన గుట్కాను పట్టుకున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం జహీరాబాద్‌లోని నాగులకట్టకు చెందిన అశ్విన్‌కుమార్‌ తన ఇంట్లో గుట్కాలను నిల్వచేసి ఇతర ప్రాంతాలకు చాటుమాటున తరలిస్తున్నాడు. నమ్మదగ్గ సమాచారం మేరకు అతడిఇంట్లో సోదాలు చేయగా సుమారు రూ. 80 వేల విలువ గల శ్రీటుబాకో, మీరజ్‌టుబాకో, స్వాగత్‌జర్దా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అతడి నుంచి  వాటిని స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌ఐ మాట్లాడుతూ అక్రమంగా ఎవరైనా గుట్కా తరలించినా, విక్రయించినా, నిల్వ చేసుకున్నట్లు తెలిస్తే చట్టరీత్యాచర్యలు తీసుకుంటామన్నారు.


Updated Date - 2021-07-12T05:37:40+05:30 IST