సిద్దిపేటకు నర్సింగ్‌ కళాశాల

ABN , First Publish Date - 2021-05-31T05:18:26+05:30 IST

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, అనుబంధ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు గాను రూ.50 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

సిద్దిపేటకు నర్సింగ్‌ కళాశాల

 రూ. 50కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం 

 సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట టౌన్‌, మే30: సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, అనుబంధ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు గాను రూ.50 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఆదివారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటలోని ప్రభుత్వ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌  దృష్టికి తీసుకెళ్లామని, కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిసినందుకు అనందంగా ఉందన్నారు. వచ్చే ఏడాది నుంచి నర్సింగ్‌ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని చెప్పారు. నర్సింగ్‌ కళాశాలలో 100 సీట్లు ఉంటాయని దానికి గాను 108 పోస్టులను భర్తీ చేస్తామన్నారు.

Updated Date - 2021-05-31T05:18:26+05:30 IST