ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌

ABN , First Publish Date - 2021-06-22T05:29:05+05:30 IST

పలు ప్రజా సంఘాల నాయకులు, రైతులు సోమవారం నిర్వహించిన ధర్నాలతో సంగారెడ్డి కలెక్టరేట్‌ దద్దరిల్లింది.

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌

సంగారెడ్డి రూరల్‌, జూన్‌ 21 : పలు ప్రజా సంఘాల నాయకులు, రైతులు సోమవారం నిర్వహించిన ధర్నాలతో సంగారెడ్డి కలెక్టరేట్‌ దద్దరిల్లింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో కులాల చిచ్చు పెడుతున్నదని ని రసిస్తూ కుల వివక్ష పోరాట సంఘం (కేవీపీఎస్‌) నాయకులు ధర్నా చేయగా, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పీఆర్సీని అమలు చేయాలని, జీవో 60ని సవరించి పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ అద్వర్యంలో ధర్నా చేశారు. పటాన్‌చెరు మండలం ఐనోల్‌లోని సర్వే నంబర్‌ 34లో 79.29 ఎకరాల భూమిని తమకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఆ గ్రామస్థులు, రైతులు ధర్నా నిర్వహించారు. 

Updated Date - 2021-06-22T05:29:05+05:30 IST