జొన్న పంటపై వివరాల సేకరణ
ABN , First Publish Date - 2021-06-11T05:00:44+05:30 IST
ఖేడ్ నియోజకవర్గానికి జొన్నల కొనుగోలు కేంద్రం మంజూరు కావడంతో అధికారులు జొన్న పంట సాగు, దిగుబడుల వివరాల సేకరణ ప్రారంభించారు.
నారాయణఖేడ్, జూన్ 10: ఖేడ్ నియోజకవర్గానికి జొన్నల కొనుగోలు కేంద్రం మంజూరు కావడంతో అధికారులు జొన్న పంట సాగు, దిగుబడుల వివరాల సేకరణ ప్రారంభించారు. గురువారం ఏడీఏ కరుణాకర్‌రెడ్డి, ఏఈవో సమతతో కలిసి ర్యాకల్ గ్రామంలో జొన్న పంటను సాగు చేసిన రైతులను అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు. దళారులు కొనుగోలు కేంద్రానికి జొన్నలను తీసుకురాకుండా రైతులే నేరుగా తీసుకు వచ్చేందుకు వివరాలు ఉపయోగపడతాయన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ లక్ష్మీబాయి, సర్పంచ్ పట్లోళ్ల సుజాత, విజిలెన్స్ కమిటీ సభ్యులు రవీందర్‌నాయక్, తదితరులు ఉన్నారు.