గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులకు సహకరించాలి

ABN , First Publish Date - 2021-10-08T04:52:50+05:30 IST

గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నందున పూర్తి చేసేందుకు భూనిర్వాసితులు సహకరించాలని హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి కోరారు.

గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులకు సహకరించాలి

 నిర్వాసితులతో ఆర్డీవో జయచంద్రారెడ్డి


అక్కన్నపేట, అక్టోబరు 7: గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నందున పూర్తి చేసేందుకు భూనిర్వాసితులు సహకరించాలని హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి కోరారు. గురువారం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం వద్ద ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించి నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలని, నిర్వాసితులు అందరికీ న్యాయమైన పరిహారం చెల్లించాలని నిర్వాసితులు ఆర్డీవోను కోరారు. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని ఆర్డీవో హామీ ఇచ్చారు. సమావేశంలో తహసీల్దార్‌ వేణుగోపాలరావు, ఆర్‌ఐ సురేందర్‌ పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-10-08T04:52:50+05:30 IST