కలెక్టర్‌ హన్మంతరావును ప్రశంసించిన సీఎం

ABN , First Publish Date - 2021-01-12T05:47:07+05:30 IST

జిల్లాలో వందశాతం వైకుంఠధామాలను నిర్మించడానికి కృషి చేసిన కలెక్టర్‌ హన్మంతరావును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసించారు.

కలెక్టర్‌ హన్మంతరావును ప్రశంసించిన సీఎం
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశానికి హాజరైన కలెక్టర్‌ హన్మంతరావు

సంగారెడ్డి టౌన్‌, జనవరి 11 : జిల్లాలో వందశాతం వైకుంఠధామాలను నిర్మించడానికి కృషి చేసిన కలెక్టర్‌ హన్మంతరావును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌ హన్మంతరావును ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లాలోని 647 గ్రామాల్లో వందశాతం వైకుంఠధామాలను నిర్మించి వాటిని అందుబాటులోకి తీసుకురావడంలో కలెక్టర్‌ కృషి అభినందనీయమన్నారు. సంగారెడ్డి జిల్లాను ఆదర్శంగా తీసుకుని మిగితా జిల్లాల్లో కూడా వందకు వందశాతం వైకుంఠధామాలను నిర్మించాలని సీఎం కేసీఆర్‌ ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.


Updated Date - 2021-01-12T05:47:07+05:30 IST