ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-01-01T04:20:29+05:30 IST

ప్రజా సమస్యలపై నిరసన తెలియజేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని సిద్దిపేట కాంగ్రెస్‌ నాయకుడు దరిపల్లి చంద్రం, పట్టణాధ్యక్షుడు అత్తుఇమామ్‌ వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఎం కేసీఆర్‌

 సిద్దిపేట కాంగ్రెస్‌ నాయకుడు దరిపల్లి చంద్రం


సిద్దిపేట టౌన్‌, డిసెంబరు 31: ప్రజా సమస్యలపై నిరసన తెలియజేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని సిద్దిపేట కాంగ్రెస్‌ నాయకుడు దరిపల్లి చంద్రం, పట్టణాధ్యక్షుడు అత్తుఇమామ్‌ వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భూపాలపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసుల చేత అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని, అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లి వివరిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మాజర్‌ మాలిక్‌, సిద్దిపేట పట్టణ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్‌ అతీక్‌, గ్యాదరి మధు, ఎన్‌ఎ్‌సయుఐ నాయకులు రాయసుద్దీన్‌, భిక్షపతి, గాయసుద్దీన్‌,అనిల్‌, నదీమ్‌, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-01-01T04:20:29+05:30 IST