డబుల్‌ ఇళ్ల నిర్మాణంలో మట్టి ఇసుక, స్టోన్‌ డస్ట్‌

ABN , First Publish Date - 2021-11-24T05:22:01+05:30 IST

మండలంలోని కొండాపూర్‌లో నిర్మిస్తున్న 20 డబుల్‌ బెడ్రూం ఇళ్లను అత్యంత నాసిరకంగా నిర్మిస్తున్నారు. సంబంధిత అధికారులు పర్యవేక్షించకపోవడంతో కాంట్రాక్టర్‌ ఇష్టానుసారంగా పనులను చేస్తున్నాడు. నాణ్యతాలోపం కొట్టచ్చినట్లు కనిపిస్తున్నది. మట్టి ఇసుక, స్టోన్‌డ్‌స్టను తీసుకువచ్చి ఇళ్ల నిర్మాణ పనులకు వినియోగిస్తున్నారు.

డబుల్‌ ఇళ్ల నిర్మాణంలో మట్టి ఇసుక, స్టోన్‌ డస్ట్‌

కొండాపూర్‌లో నాసిరకంగా పనులు


మిరుదొడ్డి, నవంబరు 23 : మండలంలోని కొండాపూర్‌లో నిర్మిస్తున్న 20 డబుల్‌ బెడ్రూం ఇళ్లను అత్యంత నాసిరకంగా నిర్మిస్తున్నారు. సంబంధిత అధికారులు పర్యవేక్షించకపోవడంతో కాంట్రాక్టర్‌ ఇష్టానుసారంగా పనులను చేస్తున్నాడు. నాణ్యతాలోపం కొట్టచ్చినట్లు కనిపిస్తున్నది. మట్టి ఇసుక, స్టోన్‌డ్‌స్టను  తీసుకువచ్చి ఇళ్ల నిర్మాణ పనులకు వినియోగిస్తున్నారు. దీంతో ఈ ఇళ్లు వర్షానికి ఎప్పుడు కూలుతాయోనని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నాసిరకమైన ఇసుకలో సరైన మోతాదులో సిమెంట్‌ను వాడడం లేదు. ఇప్పటికే ఆలస్యంగా నిర్మాణమవుతుంటే ఇంత నాసిరకంగా నిర్మిస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇళ్ల పనులను పరిశీలిండంతో పాటు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 



Updated Date - 2021-11-24T05:22:01+05:30 IST