యశ్వంతరావు పేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2021-08-26T03:52:57+05:30 IST
మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పది మందిపై కేసు నమోదు చేసి 9 మందిని రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ మహేందర్ వెల్లడించారు.

10 మందిపై కేసు నమోదు
తొమ్మిది మందికి రిమాండ్
వెల్దుర్తి ఆగస్టు 25: మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పది మందిపై కేసు నమోదు చేసి 9 మందిని రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ మహేందర్ వెల్లడించారు. బుధవారం ఎస్‌ఐ విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం గ్రామస్థులు వనభోజనాలకు వెళ్లారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమ విషయమై ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. అందులో ఓ వర్గానికి చెందిన తొమ్మిమందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, అదేవిధంగా మరో వర్గానికి చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వివరించారు.