చిప్పల్‌తుర్తి అటవీబ్లాక్ ప్రాంతాన్ని మొత్తం సర్వే చేస్తాం
ABN , First Publish Date - 2021-02-26T05:55:47+05:30 IST
నర్సాపూర్ రేంజి పరిధిలోని చిప్పల్‌తుర్తి బ్లాక్ పరిధిలోని 1600 ఎకరాల భూమిని పూర్తిగా సర్వే చేయనున్నట్లు జిల్లా అటవీఅధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. చిప్పల్‌తుర్తి బ్లాక్ 308 కంపార్టుమెంటు పరిధిలో నెలకొన్న వివాదాస్పద భూములపై రెవెన్యూ, అటవీశాఖలు సంయుక్తంగా సర్వేను చేపట్టాయి. అందులో భాగంగా గురువారం సర్వే అండ్ ల్యాండ్, అటవీఅధికారులు కలిసి సర్వే చేశారు.

జిల్లా అటవీ అధికారి జ్ఞానేశ్వర్
నర్సాపూర్, ఫిబ్రవరి 25 : నర్సాపూర్ రేంజి పరిధిలోని చిప్పల్‌తుర్తి బ్లాక్ పరిధిలోని 1600 ఎకరాల భూమిని పూర్తిగా సర్వే చేయనున్నట్లు జిల్లా అటవీఅధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. చిప్పల్‌తుర్తి బ్లాక్ 308 కంపార్టుమెంటు పరిధిలో నెలకొన్న వివాదాస్పద భూములపై రెవెన్యూ, అటవీశాఖలు సంయుక్తంగా సర్వేను చేపట్టాయి. అందులో భాగంగా గురువారం సర్వే అండ్ ల్యాండ్, అటవీఅధికారులు కలిసి సర్వే చేశారు. జిల్లా అటవీఅధికారి జ్ఞానేశ్వర్, జిల్లా ఏడీ గంగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ రేంజి కార్యాలయంలో డీఎ్‌ఫవో జ్ఞానేశ్వర్ విలేకరులతో మాట్లాడుతూ చిప్పల్‌తుర్తి బ్లాక్ పరిధిలో నెలకొన్న సమస్య పరిష్కారానికి పకడ్బందీగా రెండు శాఖల ఆధ్వర్యంలో సర్వే చేపట్టామన్నారు. ఈ సర్వేలో ఈ బ్లాక్ పరిధిలో ఉన్న అటవీశాఖకు చెందిన భూమికి ఎటువంటి నష్టం రాలేదని తెలిపారు. అయితే అటవీ, పట్టా భూముల మధ్య కొంత మేర ఉన్న భూములు ఎవరివి అనేది తేల్చడానికి బ్లాక్ పరిధిలోని 1600 ఎకరాలను కూడా సర్వే చేసి కచ్చితమైన నివేదిక ఇవ్వనున్నామని తెలిపారు. అర్బన్‌పార్కులో కొత్తగా నిర్మించనున్న కాటేజీలకు సంబంధించిన టెండరు ప్రక్రియ పూర్తయిందని త్వరలోనే వాటి పనులను మొదలు పెడుతామన్నారు. పర్యాటకుల కోసం ఐదు, వీఐపీల కోసం రెండు కాటేజీలను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఇన్‌చార్జి ఆర్డీవో సాయిరాం, ఎఫ్‌ఆర్వో అంబర్‌సింగ్ తదితరులు ఉన్నారు.