సుందరీకరణకు నోచుకోని చేర్యాల మున్సిపాలిటీ

ABN , First Publish Date - 2021-07-09T04:38:56+05:30 IST

చేర్యాల పట్టణాన్ని మూడేళ్లక్రితం మునిసిపాలిటీగా మార్చినప్పటికీ మునిసిపల్‌ మార్క్‌ కానరావడం లేదు.

సుందరీకరణకు నోచుకోని చేర్యాల మున్సిపాలిటీ
సుందరీకరణకు నోచుకోని అంగడిబజారు చౌరస్తా

చేర్యాల, జూలై 8: చేర్యాల పట్టణాన్ని మూడేళ్లక్రితం మునిసిపాలిటీగా మార్చినప్పటికీ మునిసిపల్‌ మార్క్‌ కానరావడం లేదు. ప్రత్యేకంగా నిధులు మంజూరు కాకపోవడంతో మౌలిక వసతుల కల్పనతో పాటు సుందరీకరణకు నోచుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు హామీలవర్షం గుప్పిస్తున్నారే గానీ అమలులో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మునిసిపాలిటీ శోభను ఇనుమడింపచేసేలా ప్రధాన జంక్షన్లను సుందరీకరించాలని పలుమార్లు మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ పి.వెంకట్రామారెడ్డి సూచనలు చేశారు. తెలంగాణ తల్లి, అంబేడ్కర్‌ విగ్రహాలున్న ప్రాంతాల్లో, తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం ఉన్న అంగడి బజారుచౌరస్తాతో పాటు గాంధీచౌక్‌ను సుందరీకరించాలని తెలిపారు. ఏళ్లుగడుస్తున్నా ఆయా జంక్షన్లను అభివృద్ధికి నోచుకోవడం లేదు.


 

Updated Date - 2021-07-09T04:38:56+05:30 IST