పాన్‌షాపుల్లో తనిఖీలు

ABN , First Publish Date - 2021-05-20T06:02:45+05:30 IST

చేర్యాల పట్టణంలోని పలుపాన్‌షాపుల్లో బుధవారం పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

పాన్‌షాపుల్లో తనిఖీలు

రూ.2.50 లక్షల విలువైన గుట్కా పట్టివేత

ఇద్దరిపై కేసు నమోదు


చేర్యాల, మే 19 : చేర్యాల పట్టణంలోని పలుపాన్‌షాపుల్లో బుధవారం పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ‘గుప్పుమంటున్న గంజాయ్‌’ శీర్షికన ఆంధ్రజ్యోతి దినపత్రిలో మత్తుకు బానిసవుతున్న యువతపై ప్రచురితమైన కథనానికి వారు స్పందంచారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం పట్టణంలోని పలు పాన్‌షాపులను తనిఖీ చేశారు.


రూ.2.50 లక్షల విలువైన గుట్కా పట్టివేత

చేర్యాల పట్టణంలోని ఓవ్యాపారితో పాటు పాన్‌షాప్‌ నిర్వాహకుడి ఇంట్లో దాడి చేసి రూ.2.50లక్షల విలువ గల గుట్కా, పొగాకు, అంబర్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చేర్యాల సీఐ భీంరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్కాసమాచారం మేరకు చేర్యాల ఏఎ్‌సఐ కృష్ణమూర్తి సిబ్బందితో కలిసి కృష్ణా పాన్‌షా్‌పలో దాడి చేయగా రూ.10వేల విలువ గల గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నట్లు చెప్పారు. అనంతరం అతడిని విచారించగా పట్టణానికి చెందిన ఉమాకాంత్‌ ఇంట్లో రూ.2.40లక్షల విలువైన 19 గుట్కాప్యాకెట్ల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 


పోతిరెడ్డిపలిలో విచారణ

రెండురోజుల క్రితం పోతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఘటన విషయమై ఎక్సైజ్‌ అధికారులు పర్యటించారు. సర్పంచ్‌ కత్తుల కృష్ణవేణితో మాట్లాడారు. కానీ స్థానికులు తమకు ఎలాంటి సమాచారం అందించకపోవడంతో తిరిగి వచ్చేశామని ఎక్సైజ్‌ ఎస్‌ఐ రజితరెడ్డి తెలిపారు. ఎవరైనా తమకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు, ఎక్సైజ్‌శాఖ అధికారులు నామమాత్రంగా కాకుండా పారదర్శకంగా సమగ్ర విచారణ చేపట్టి గంజాయి ముఠాను గుట్టురట్టు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 


అంబర్‌, జర్దా, గుట్కా ప్యాకెట్ల పట్టివేత

చేగుంట, మే 19:  చేగుంటలోని ఓ కిరాణాషాపుపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి రూ.22,960 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. చేగుంటలోని రాజరాజేశ్వరి కిరాణదుకాణంలో అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. దుకాణ యజమాని కాచం రామచంద్రంపై కేసు నమోదు చేశారు. మెదక్‌ జిల్లాలో ఎక్కడైన అంబర్‌, జర్దా, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే 100కు, లేదా మెదక్‌ జిల్లా పోలీస్‌ వాట్సప్‌ నంబర్‌ 7330671900 కు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సిఐ మురళికుమార్‌, టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ గోప్యనాయక్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-20T06:02:45+05:30 IST