దత్తత గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించిన చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2021-03-23T04:37:59+05:30 IST

దత్తత గ్రామంవెంకటాపూర్‌ (అగ్రహారం)కు జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. సోమవారం వెంకటాపూర్‌ అగ్రహారంలో ఆర్టీసీ బస్సును తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, మనోహరాబాద్‌, తూప్రాన్‌ ఎంపీపీలు పురం నవనీతారవి, గడ్డి స్వప్నతో కలిసి ప్రారంభించారు.

దత్తత గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించిన చైర్‌పర్సన్‌
10 వెంకటాపూర్‌ అగ్రహారంలో బస్సును ప్రారంభిస్తున్న హేమలత

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), మార్చి 22: దత్తత గ్రామంవెంకటాపూర్‌ (అగ్రహారం)కు జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. సోమవారం వెంకటాపూర్‌ అగ్రహారంలో ఆర్టీసీ బస్సును తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, మనోహరాబాద్‌, తూప్రాన్‌ ఎంపీపీలు పురం నవనీతారవి, గడ్డి స్వప్నతో కలిసి ప్రారంభించారు. మేడ్చల్‌ డిపోకు చెందిన బస్సు దండుపల్లి, కోనాయపల్లి (పీటీ), ధర్మరాజ్‌పల్లి, వెంకటాపూర్‌ అగ్రహారం, తూప్రాన్‌ మండలం దమ్మక్కపల్లి, ఘనపూర్‌ మీదుగా తూప్రాన్‌కు చేరుకుంటుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్‌, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌ రేణుక పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-23T04:37:59+05:30 IST