మండలాల్లోనూ అంబులెన్స్‌ సేవలను అందుబాటులో ఉంచాలి

ABN , First Publish Date - 2021-08-28T04:58:56+05:30 IST

సిద్దిపేట జిల్లా పరిధిలోని వివిధ మండలాల్లో అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తేవాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డికి శుక్రవారం లేఖ రాశారు.

మండలాల్లోనూ అంబులెన్స్‌ సేవలను అందుబాటులో ఉంచాలి

కలెక్టర్‌కు లేఖ రాసిన చాడ


సిద్దిపేట అర్బన్‌, ఆగస్టు 27 : సిద్దిపేట జిల్లా పరిధిలోని వివిధ మండలాల్లో అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తేవాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. హుస్నాబాద్‌ డివిజన్‌ పరిధిలో అక్కన్నపేట, కోహెడ, దూల్మిట్ట మండలాలు, గజ్వేల్‌ డివిజన్‌ పరిధిలోని వర్గల్‌, మర్కుక్‌ మండలాల్లో 108 సేవలు లేకపోవడం మూలంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రైవేటు వాహనాల్లో రోగులను తీసుకొని హాస్పిటల్‌కు చేరేలోపు ప్రాణ నష్టం జరుగుతోందని, కరోనా నేపథ్యంలో అంబులెన్స్‌లో అందుబాటులోకి తెచ్చేల కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు.



Updated Date - 2021-08-28T04:58:56+05:30 IST