లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కేసులు

ABN , First Publish Date - 2021-05-21T04:47:35+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ హెచ్చరించారు.

లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కేసులు
రామాయంపేటలో లాక్‌డౌన్‌ అమలు తీరును పరిశీలిస్తున్న డీఎస్పీ కిరణ్‌కుమార్‌

 రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్‌

 తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌


రామాయంపేట, మే 20: లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ హెచ్చరించారు. ఉదయం 10 గంటలకు నిమిషం దాటినా లాక్‌డౌన్‌ ఉల్లంఘనే అవుతుందన్నారు. కొనుగోలుదారులు, వ్యాపారులు మరింత ముందుగానే ఇళ్లలోకి వెళ్లిపోవాలని సూచించారు. గురువారం ఆయన పట్టణంలోని ప్రధాన వీధుల్లో లాక్‌డౌన్‌ అమలు తీరును పరిశీలించారు. ఇప్పటివరకు డివిజన్‌ పరిధిలో 240 కేసులు నమోదు చేశామన్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్‌ చేస్తామని తెలిపారు. కర్ఫ్యూ అమలుపై కఠినంగా వ్యవహరించాలని స్థానిక ఎస్‌ఐ రాజేష్‌, పోలీసు సిబ్బందికి సూచించారు.

చేగుంట: చేగుంటలో లాక్‌డౌన్‌ అమలును డీఎస్పీ కిరణ్‌కుమార్‌ పరిశీలించారు. ఆయనవెంట ఎస్‌ఐ సుభా్‌షగౌడ్‌ ఉన్నారు.

తూప్రాన్‌: పట్టణంలో గురువారం డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సీఐ స్వామిగౌడ్‌, ఎస్‌ఐ సత్యనారాయణలు తనిఖీలు చేపట్టారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను సీజ్‌ చేశారు. 

సదాశివపేట: పట్టణంలో డీఎస్పీ బాలాజీ లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించారు. సీఐ గూడూరి సంతో్‌షకుమార్‌తో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. నిబంధనలు పాటించని 25 మందిపై కేసులు నమోదు చేసి, 7 బైక్‌లను సీజ్‌ చేశారు. తనిఖీల్లో ఎస్‌ఐలు ప్రశాంత్‌, రవి, శాబొద్దీన్‌ పాల్గొన్నారు.


 

Updated Date - 2021-05-21T04:47:35+05:30 IST