కరోనా భయంతో ఊరవతలకి!

ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST

ఇంటి చుట్టుపక్కల కరోనా కేసులు పెరుగుతుండడంతో ఓ కుటుంబం భయంతో ఏకంగా గ్రామాన్నే విడిచింది. ఊరుకి దూరంగా ఉన్న వారి వ్యవసాయ బావి వద్దకి చేరుకున్నది.

కరోనా భయంతో ఊరవతలకి!

వ్యవసాయ బావి వద్ద నివసిస్తున్న కుటుంబం


చేర్యాల, మే 5 : ఇంటి చుట్టుపక్కల కరోనా కేసులు పెరుగుతుండడంతో ఓ కుటుంబం భయంతో ఏకంగా గ్రామాన్నే విడిచింది. ఊరుకి దూరంగా ఉన్న వారి వ్యవసాయ బావి వద్దకి చేరుకున్నది. చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన గూడెపు పెంటయ్య నివాసముండే వీధిలో కొద్దిరోజుల క్రితం పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గ్రామంలో తెలిసిన వారికి ఒక్కొక్కరికి కరోనా సోకుతుండడంతో ఆందోళనకు గురైన పెంటయ్య గ్రామ శివారులోని తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడే తాత్కాలికంగా గుడారం ఏర్పాటు చేసుకుని కుటుంబసభ్యులతో నివసిస్తున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో గడుపుతున్నారు.Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST