గంజాయిని సమూలంగా అరికట్టాలి: ఏసీపీ

ABN , First Publish Date - 2021-10-29T04:43:04+05:30 IST

హుస్నాబాద్‌ సర్కిల్‌ పరిధిలో గంజాయిని సమూలంగా అరికట్టాలని ఏసీసీ వాసాల సతీష్‌ పోలీసు అధికారులకు సూచించారు.

గంజాయిని సమూలంగా అరికట్టాలి: ఏసీపీ

 హుస్నాబాద్‌, అక్టోబరు 28: హుస్నాబాద్‌ సర్కిల్‌ పరిధిలో గంజాయిని సమూలంగా అరికట్టాలని ఏసీసీ వాసాల సతీష్‌ పోలీసు అధికారులకు సూచించారు. గురువారం హుస్నాబాద్‌ ఏసీపీ కార్యాలయంలో సర్కిల్‌ పోలీసు అధికారులతో పెండింగ్‌ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయిని విక్రయించే ప్రదేశాలపై, తాగే వ్యక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల సరిహద్దులో హుస్నాబాద్‌ ప్రాతం ఉన్నందున వాహనాల తనిఖీ నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, టార్గెట్‌కు మించి ఎక్కువ కేసులు అండర్‌ ఇన్వెస్టిగేషన్‌లో ఉండకూడదని సూచించారు. గుర్తుతెలియని ప్రాపర్టీ కింద పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న వాహనాలను జిల్లా సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌కు పంపించాలన్నారు. సమావేశంలో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్‌ఐలు శ్రీధర్‌, రవి, రాజకుమార్‌, శిక్షణ ఎస్‌ఐలు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-10-29T04:43:04+05:30 IST