ప్రశాంతంగా టీజీయూజీసెట్‌ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2021-07-12T05:54:52+05:30 IST

తెలంగాణ గురుకులం అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామ న్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీజీయూజీసెట్‌) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా టీజీయూజీసెట్‌ ప్రవేశ పరీక్ష

మెదక్‌ అర్బన్‌, జూలై 11: తెలంగాణ గురుకులం అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామ న్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీజీయూజీసెట్‌) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సం దర్భంగా డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ మర్సి వరూధిని మాట్లాడుతూ.. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షను నిర్వహించమన్నారు. మెదక్‌లోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ బాలికల(వెలుగు)లో 300 మంది విద్యార్థులకు 182 మంది హాజరుకాగా, 118 మంది గైర్హాజరయ్యారు. రామాయంపేటలోని కాళ్లగడ్డ సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో 297 మందికి 181 మంది హాజరు కాగా 116 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీసీవో తెలిపారు.

Updated Date - 2021-07-12T05:54:52+05:30 IST