విద్యుదాఘాతంతో ఇంట్లో సామగ్రి దగ్ధం

ABN , First Publish Date - 2021-03-24T05:51:46+05:30 IST

కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి నర్సింహులు ఇంట్లో మంగళవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగింది.

విద్యుదాఘాతంతో ఇంట్లో సామగ్రి దగ్ధం
దగ్ధమైన ఇంట్లోని సామగ్రి

చేర్యాల, మార్చి 23 : కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి నర్సింహులు ఇంట్లో మంగళవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లోని ఫ్రిజ్‌, టీవీ, కూలర్‌, ఇతర సామగ్రితో పాటు రూ.20 వేల నగదు బూడిదయ్యాయి. మంటలు ఎగిసిపడడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు మంటలను ఆర్పేశారు. రూ.1.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని, నర్సింహులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. 

Updated Date - 2021-03-24T05:51:46+05:30 IST