ప్రమాదవశాత్తు టర్పెంట్‌ఆయిల్‌ తాగి బాలుడి మృతి

ABN , First Publish Date - 2021-05-20T05:45:26+05:30 IST

ప్రమాదవశాత్తూ టర్పెంట్‌ఆయిల్‌ తాగి బాలుడు మృతి చెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. మండలంలోని దర్పల్లి గ్రా మానికి చెందిన టేక్మాల్‌ శేఖర్‌రెడ్డి, శైలజ దంపతుల రెండవ కుమారుడు అక్షిత్‌రెడ్డి (9) మంగళవారం తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు.

ప్రమాదవశాత్తు టర్పెంట్‌ఆయిల్‌ తాగి బాలుడి మృతి

చిన్నశంకరంపేట, మే 19: ప్రమాదవశాత్తూ టర్పెంట్‌ఆయిల్‌ తాగి బాలుడు మృతి చెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. మండలంలోని దర్పల్లి గ్రా మానికి చెందిన టేక్మాల్‌ శేఖర్‌రెడ్డి, శైలజ దంపతుల రెండవ కుమారుడు అక్షిత్‌రెడ్డి (9) మంగళవారం తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు. వారి ఇంట్లో ఓ ఫంక్షన్‌ ఉండగా ఇంటికి రుంగులు వేస్తున్నారు. ఇంట్లో కలర్లు, టర్పెంట్‌ ఆయిల్‌ పక్కన పెట్టారు. పిల్లలతో ఆటలు ఆడుతున్న అక్షిత్‌రెడ్డికి దాహం కావడంతో నీళ్ల బాటిల్‌ అనుకొని ప్రమాదవశాత్తూ నీళ్లలాగా ఉన్న టర్పెంట్‌ ఆయిల్‌ను తాగాడు. కొద్ది సేపటికి బాలుడు అస్వస్థతకు గురవడంతో గమనించిన కుటుంబసభ్యులు  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్షిత్‌రెడ్డి చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు.


Updated Date - 2021-05-20T05:45:26+05:30 IST