తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలు

ABN , First Publish Date - 2021-12-27T04:41:50+05:30 IST

తెలంగాణ ఆత్మగౌరవం, నిధులు, నియామకాల్లో జరుగుతున్న దోపీడీని అరికట్టేందు

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలు

టీఆర్‌ఎ్‌సవీ జిల్లా అధ్యక్షుడు మహేష్‌


నారాయణరావుపేట, డిసెంబరు 26 : తెలంగాణ ఆత్మగౌరవం, నిధులు, నియామకాల్లో జరుగుతున్న దోపీడీని అరికట్టేందుకు కోట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో మళ్లీ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల రూపంలో కుట్రలు మొదలయ్యాయని టీఆర్‌ఎ్‌సవీ జిల్లా అధ్యక్షులు మేర్గు మహేష్‌ అన్నారు. ఆదివారం నారాయణరావుపేట మండల కేంద్రంలో టీఆర్‌ఎ్‌సవీ సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడారు. కేసీఆర్‌ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం  అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు.  దీన్ని జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మే ధోరణిని అవలంభిస్తున్నాయని ఆరోపించారు. టీఆర్‌ఎ్‌సవీ నాయకత్వం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల కుటిల బుద్ధిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. అనంతరం టీఆర్‌ఎ్‌సవీ నూతన గ్రామకమిటీని ఎన్నుకున్నారు. గ్రామశాఖ అధ్యక్షుడిగా బొంగురం అజీత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా కొమిరే రాజు, ప్రధాన కార్యదర్శిగా బాగన్ననవీన్‌ను ఎన్నుకున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు సంతోష్‌ కుమార్‌, ఉపసర్పంచ్‌ స్వామి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బండి ఎల్లయ్య, మండల పార్టీ అధ్యక్షులు కిషన్‌, యూత్‌ మండల అధ్యక్షులు భాస్కర్‌ నేత, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు దేవరాజు, యాదగిరి, ప్రకాష్‌, అజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T04:41:50+05:30 IST