డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

ABN , First Publish Date - 2021-10-30T04:28:31+05:30 IST

మర్కుక్‌ మండల పరిధిలోని పాములపర్తి గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శుక్రవారం ఎంపీపీ తాండ పాండుగౌడ్‌, జడ్పీటీసీ యెంబరి మంగమ్మరాంచంద్రంయాదవ్‌, సర్పంచ్‌ పాములపర్తి తిర్మల్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ మంద బాల్‌రెడ్డి భూమి పూజ చేశారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

 జగదేవ్‌పూర్‌, అక్టోబరు 29: మర్కుక్‌ మండల పరిధిలోని పాములపర్తి గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శుక్రవారం ఎంపీపీ తాండ పాండుగౌడ్‌, జడ్పీటీసీ యెంబరి మంగమ్మరాంచంద్రంయాదవ్‌, సర్పంచ్‌ పాములపర్తి తిర్మల్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ మంద బాల్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఇంతకు ముందు 50 ఇళ్లను నిర్మించారని, ప్రస్తుతం 100 ఇళ్లను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాచారం ఆలయ చైర్మన్‌ హరిపంతులు, తహసీల్దార్‌ ఆరీఫా, పంచాయతీ కార్యదర్శి స్వప్న, ఉపసర్పంచ్‌ పద్మనర్సింలు, వార్డు సభ్యులు ప్రభాకర్‌, లక్ష్మీ నాగరాజు, మల్లేష్‌, కాంట్రాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు మధుసూదన్‌, బాల స్వామి తదితరులున్నారు.


 

Updated Date - 2021-10-30T04:28:31+05:30 IST