సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : ఏఎస్పీ

ABN , First Publish Date - 2021-11-24T05:20:25+05:30 IST

సైబర్‌ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ నితిక పంత్‌ సూచించారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : ఏఎస్పీ
విద్యార్థులతో ప్రమాణం చేయిస్తున్న ఏఎస్పీ నితిక పంత్‌

సదాశివపేట/జహీరాబాద్‌/చిల్‌పచెడ్‌/పాపన్నపేట/చిన్నశంకరంపేట/నాగల్‌గిద్ద/పుల్కల్‌, నవంబరు 23 : సైబర్‌ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ నితిక పంత్‌ సూచించారు. విద్యార్థులకు సైబర్‌ నేరాల పట్ల అవగాహన కల్పించడం కోసం పోలీసు, విద్యాశాఖ సమన్వయంతో ప్రారంభించిన సైబర్‌ కాంగ్రెస్‌ ప్రాజెక్టులో భాగంగా సదాశివపేటలోని రవీంద్ర మోడల్‌ స్కూల్‌లో ‘ఇన్వెస్టిట్యూచర్‌ సెరిమనీ ఫర్‌ సైబర్‌ అంబాసిడర్‌’ అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. రవీంద్ర మోడల్‌ స్కూల్‌లో ఎంపిక చేయబడిన ఇద్దరు సైబర్‌ అంబాసిడర్లకు బ్యాడ్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీ్‌సస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ వినాయక్‌రెడ్డి, విద్యాశాఖ నుంచి జెండర్‌ ఈక్విటీ జిల్లా కోఆర్డినేటర్‌ సుప్రియ, రాజేష్‌, లింబాజి, కల్పన పాల్గొన్నారు. సైబర్‌ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చిరాగ్‌పల్లి ఎస్‌ఐ కాశీనాథ్‌, జహీరాబాద్‌ రూరల్‌ ఎస్‌ఐ రవికుమార్‌ అన్నారు. మొగుడంపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, జహీరాబాద్‌ మండలం హోతి (కే) గ్రామ శివారులో గల కేజీబీవీ ఉన్నత పాఠశాలలో సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, హారతి, ఉపాధ్యాయులు పోలీస్‌ సిబ్బంది, షీటీం పాల్గొన్నారు. నర్సాపూర్‌ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు విఠల్‌ ఆధ్వర్యంలో సైబర్‌ నేరాల పట్ల అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌ఐ మల్లారెడ్డి నేరాటపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు రమేష్‌, భారతీదేవి, కొండల్‌, రుక్మిణీ, ఆదినారాయణ ఉన్నారు. నర్సాపూర్‌ మండలంలోని నాగ్సాన్‌పల్లి ఉన్నత పాఠశాలలో సైబర్‌ కాంగ్రెస్‌ సమావేశం నిర్వహించారు. పాఠశాల నుంచి సైబర్‌ అంబాసిడర్‌గా ఎంపికైన శ్రావ్య, ఎస్‌.విష్ణువర్ధన్‌ సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. కానిస్టేబుళ్లు మహేష్‌, కృష్ణ, ఎస్‌ఎంసీ చైర్మన్‌ వెంకటగాంధీ, ఉపాధ్యాయులు నర్సింహులు, బాబర్‌, తిరుపతిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అర్చన అధ్యక్షతన సైబర్‌ కాంగ్రెస్‌ సమావేశం నిర్వహించారు. ఎస్‌ఐ గౌస్‌ సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. కానిస్టేబుల్‌ అర్చన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాగల్‌గిద్ద మండలంలోని మోర్గి మోడల్‌ కళాశాలలో సైబర్‌ నేరాలపై ఎస్‌ఐ విజయ్‌రావు అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్‌ రమేష్‌, సర్పంచ్‌ అశోక్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చౌటకూర్‌ మండలం శివంపేట, మండల కేంద్రమైన పుల్కల్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో వేర్వేరుగా సైబర్‌ నేరాలపై జోగిపేట సీఐ బి.శ్రీనివాస్‌, పుల్కల్‌ ఎస్‌ఐ బండారు నాగలక్ష్మి అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌, వహీద్‌పాషా, కేజీవీబీ ఎస్‌వో ఇందిర, సైబర్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి నాగభూషణం, మజీద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T05:20:25+05:30 IST