కరోనా సోకకుండా అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-05-09T04:50:08+05:30 IST

కరోన తీవ్ర రూపం దాలుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ సూచించారు.

కరోనా సోకకుండా అప్రమత్తంగా ఉండాలి
నర్సాపూర్‌లో కిట్లను అందజేస్తున్న మురళీధర్‌యాదవ్‌

మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌


నర్సాపూర్‌, మే 8: కరోన తీవ్ర రూపం దాలుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ సూచించారు. శనివారం నర్సాపూర్‌ పట్టణంలో కరోనాతో బాధపడుతున్న వ్యక్తుల కుటుంబాలకు అజయ్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఎప్పటికప్పుడు శానిటేషన్‌ చేస్తూ జాగ్రతలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యాదగిరి, రామచందర్‌, నాయకులు భిక్షపతి, నగేష్‌, రమే్‌షయాదవ్‌ పాల్గొన్నారు.


 

Updated Date - 2021-05-09T04:50:08+05:30 IST