వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-07-25T04:40:51+05:30 IST

వర్షాల పట్ల విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ అన్నారు.

వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలి

 హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ 


చేర్యాల, జూలై 24: వర్షాల పట్ల విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ అన్నారు. శనివారం చేర్యాల పెద్దచెరువును సందర్శించారు. అనంతరం పోలీ్‌సస్టేషన్‌లో సిబ్బందితో సమావేశమయ్యారు. వాగులు, చెరువుల సమాచారాన్ని ప్రతీరోజూ తెలుసుకోవాలని సూచించారు. 100డయల్‌కు కాల్‌రాగానే బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకోవాలన్నారు. సమావేశంలో సీఐ శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు.


హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి


మద్దూరు: చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల వద్ద ప్రజాప్రతినిధులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఏసీపీ మహేందర్‌ సూచించారు. శనివారం గాగిళ్లాపూర్‌ పెద ్ద చెరువును ఆయన సందర్శించి, పలు సూచనలు చేశారు.


 

Updated Date - 2021-07-25T04:40:51+05:30 IST