ఆడపడుచులకు పండుగ సారెగా బతుకమ్మ చీరలు

ABN , First Publish Date - 2021-10-07T05:30:00+05:30 IST

రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ పుట్టింటిసారెగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ చీరలను అందజేస్తున్నారని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. చిల్‌పచెడ్‌, హత్నూర మండలకేంద్రాల్లో గురువారం మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలను మఖ్యమంత్రి ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు.

ఆడపడుచులకు పండుగ సారెగా బతుకమ్మ చీరలు

నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి


చిల్‌పచెడ్‌/హత్నూర, అక్టోబరు 7: రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ పుట్టింటిసారెగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ చీరలను అందజేస్తున్నారని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. చిల్‌పచెడ్‌, హత్నూర మండలకేంద్రాల్లో గురువారం మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలను మఖ్యమంత్రి ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. చిల్‌పచెడ్‌లో ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, సర్పంచ్‌ లక్ష్మిదుర్గారెడ్డి, ఎంపీడీవో శశిప్రభ, తహసీల్దార్‌ సహదేవ్‌, జిల్లా మైనింగ్‌ ఏడీ జైరాం, మండల ఎస్‌వో దేవయ్య, పీఏసీఎస్‌ చెర్మన్‌ దర్మారెడ్డి, వైస్‌చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ విశ్వంబర్‌ తదితరులు పాల్గొన్నారు. హత్నూరలో రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ అధ్యక్షుడు నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, సర్పంచ్‌ వీరస్వామిగౌడ్‌, తహసీల్దార్‌ పద్మావతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దుర్గారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, ఆర్‌ఐ గంగాధర్‌, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం : జడ్పీ చైర్‌పర్సన్‌

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), అక్టోబరు 7: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని జడ్పీచైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ పేర్కొన్నారు. మనోహరాబాద్‌ మండలంలోని తన దత్తత గ్రామం వెంకటాపూర్‌ ఆగ్రహారంలో గురువారం ఆమె బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నివర్గాల అభ్యుతన్నతికి పథకాలు అమలుచేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రేణుక ఆంజనేయులు, ఎంపీపీ నవనీతారవి, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పురం మహేశ్‌, ఉపసర్పంచ్‌ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 


గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ

మెదక్‌ మున్సిపాలిటీ/శివ్వంపేట/అల్లాదుర్గం/చిన్నశంకరంపేట/అక్టోబరు 7: మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఆరోవార్డులో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ వంజరి జయరాజ్‌, గంగాధర్‌, లింగారెడ్డి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన శివ్వంపేటలో సర్పంచ్‌ శ్రీనివా్‌సగౌడ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి అలీ, వార్డు సభ్యుడు కొండల్‌, రేషన్‌డీలర్‌ గణేష్‌ పాల్గొన్నారు. అల్లాదుర్గం మండలంలోని కాయిదంపల్లి, ముప్పారం గ్రామాల్లో సర్పంచులు బేతయ్య, సుభా్‌షనాయక్‌ కోరారు.   ఎంపీటీసీ జయప్రదరాజు, పంచాయతీ కార్యదర్శులు సంతోష్‌, విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేటలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

సంగారెడ్డి జిల్లాలో..

నారాయణఖేడ్‌/సదాశివపేట/గుమ్మడిదల/జిన్నారం/రాయికోడ్‌/ఝరాసంగం/కల్హేర్‌, పటాన్‌చెరు రూరల్‌, అక్టోబరు 7: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండల పరిధిలోని చల్లగిద్ద తండాలో బతుకమ్మ చీరల పంపిణీని ఎంపీపీ చాందిబాయి గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుశీల, బంజారాసేవాలాల్‌ సంఘం నాయకుడు రమే్‌షచౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు. వెంకటాపూర్‌లో సర్పంచ్‌ దొడ్ల నర్సమ్మ, తుర్కపల్లి తండాలో సర్పంచ్‌ జమ్లిబాయి, ఎంపీటీసీ అశోక్‌రెడ్డి, రవీందర్‌నాయక్‌ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. సదాశివపేట పట్టణంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ చింతాగోపాల్‌, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, పులిమామిడి రాజు ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లిలో సర్పంచ్‌ రేణుకాస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీలో ఎంపీపీ విజయాభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హుస్సేన్‌, వార్డుసభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. జిన్నారం మండలంలోని గురువారం నల్తూరులో జడ్పీటీసీ ప్రభాకర్‌, వావిలాలలో ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, గడ్డపోతారంలో సర్పంచ్‌ ప్రకాశంచారి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. రాయికోడ్‌ మండలం సింగితం గ్రామంలో జడ్పీటీసీ మల్లిఖార్జున్‌పాటిల్‌ బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. మహ్మదాపూర్‌, కర్చల్‌, సిరూర్‌ తదితర గ్రామాల్లో  జరిగిన కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బస్వరాజ్‌, సర్పంచులు సంగమేశ్వర్‌పాటిల్‌, సంతో్‌షకుమార్‌ పాటిల్‌, అజ్మత్‌బేగం తదితరులు పాల్గొన్నారు. ఝరాసంగం మండల పరిధిలోని మేదపల్లి, వనంపల్లి, కమాల్‌పల్లి, జీర్లపల్లి తదితర గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాల్లో సర్పంచ్‌లు పరమేశ్వర్‌పాటిల్‌, సంగయ్య, రాంరెడ్డి, సంగ్రామ్‌పాటిల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్దన్న, అశోక్‌రావుపాటిల్‌, పాండు తదితరులు పాల్గొన్నారు. కల్హేర్‌ మండల పరిధిలోని మునిగేపల్లిలో ఆత్మ చైర్మన్‌ రాంసింగ్‌ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నవాబ్‌పటేల్‌, జలందర్‌, శ్రీనివా్‌సగౌడ్‌, వసీం తదితరలు పాల్గొన్నారు. పటాన్‌చెరు మండలం రుద్రారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌  సుధీర్‌రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్‌రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్‌రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ యాదయ్య, ఎంపీటీసీలు మన్నెరాజు,  హరిప్రసాద్‌రెడ్డి, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు బి.పాండు,  నాయకులు కుర్మ నరసింహ, వెంకట్‌రెడ్డి, దశరథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-07T05:30:00+05:30 IST