ఇందూర్‌ కళాశాలకు బ్యాండ్‌ ప్రామిసింగ్‌ హోదా

ABN , First Publish Date - 2021-12-31T17:19:47+05:30 IST

ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల బ్యాండ్‌ ప్రామిసింగ్‌ హోదా పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజు గురువారం తెలిపారు.

ఇందూర్‌ కళాశాలకు  బ్యాండ్‌ ప్రామిసింగ్‌ హోదా

సిద్దిపేట అర్బన్‌, డిసెంబరు 30: ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల బ్యాండ్‌ ప్రామిసింగ్‌ హోదా పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజు గురువారం తెలిపారు. విద్యాశాఖ మంత్రిత్వశాఖ, ప్రభుత్వంలోని అటల్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆన్‌ ఇన్నోవేషన్‌ అచీవ్‌మెంట్‌ 2021 ర్యాంకింగ్‌లో 286కాలేజీలు పాల్గొన్నాయి. అందులో ఇందూర్‌ కళాశాలకు కూడా హోదా దక్కినట్లు తెలిపారు. ఈ హోదా రావడానికి కృషిచేసిన ఇందూర్‌ స్టాఫ్‌ మెంబర్లు అందరిని ప్రిన్సిపాల్‌ అభినందించారు.

Updated Date - 2021-12-31T17:19:47+05:30 IST