ఆటో బోల్తాపడి డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-11-29T05:18:26+05:30 IST

ఆటో బోల్తాపడి డ్రైవర్‌ మృతిచెందిన సంఘటన జహీరాబాద్‌ సమీపంలో ఫేత్రు నాయక్‌ తండా వద్ద ఆదివారం రాత్రి జరిగింది.

ఆటో బోల్తాపడి డ్రైవర్‌ మృతి

జహీరాబాద్‌, నవంబరు 28: ఆటో బోల్తాపడి డ్రైవర్‌ మృతిచెందిన సంఘటన జహీరాబాద్‌ సమీపంలో ఫేత్రు నాయక్‌ తండా వద్ద ఆదివారం రాత్రి జరిగింది. జహీరాబాద్‌ రూరల్‌ ఎస్‌ఐ రవికుమార్‌ కథనం ప్రకారం... జహీరాబాద్‌ మండలం శేకపూర్‌ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ ఎండీ అక్బర్‌ (23) ఆదివారం సాయంత్రం శేకపూర్‌ నుంచి జహీరాబాద్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో అక్బర్‌ మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తండ్రి యూసుఫ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-11-29T05:18:26+05:30 IST