బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

ABN , First Publish Date - 2021-12-09T04:28:04+05:30 IST

మండలంలోని రాందా్‌సగూడాలో బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

చిల్‌పచెడ్‌, డిసెంబరు 8: మండలంలోని రాందా్‌సగూడాలో బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. బుధవారం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..  మండలానికి చెందిన రాందా్‌సగూడా గ్రామానికి చెందిన అబ్బాయికి వేరే జిల్లాకు చెందిన  మైనర్‌ అమ్మాయితో వివాహం జరుగుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు వెళ్లి విచారించగా అమ్మాయికి వివాహ వయస్సు కంటే 5 నెలలు తక్కువగా ఉన్నదని తెలిసింది. దీంతో మైనార్టీ తీరిన తర్వాతే వివాహం చేయాలని అమ్మాయి, అబ్బాయికి చెందిన పెద్దలతో మాట్లాడి కౌన్సెలింగ్‌ ఇచ్చి  ఒప్పంద పత్రం రాయించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సర్పంచ్‌ యాదగిరి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ జ్యోతి, ఎస్‌ఐ మల్లారెడ్డి, ఐసీపీఎస్‌ శంకర్‌, కార్యదర్శి, వీఆర్‌వో అంగన్‌వాడీ టీచర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-12-09T04:28:04+05:30 IST