కుకునూరుపల్లిలో బ్యాంకు చోరీకి విఫయత్నం

ABN , First Publish Date - 2021-06-22T04:31:29+05:30 IST

కొండపాక మండలం కుకునూరుపల్లిలోని గ్రామీణ వికా్‌స బ్యాంకులో గుర్తుతెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు

కుకునూరుపల్లిలో బ్యాంకు చోరీకి విఫయత్నం

కొండపాక, జూన్‌ 21: కొండపాక మండలం  కుకునూరుపల్లిలోని గ్రామీణ వికా్‌స బ్యాంకులో గుర్తుతెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు బ్యాంకు కిటికీ గ్రిల్స్‌ కట్‌ చేసి లోపలికి చొరబడ్డారు. బ్యాంకులోని లాకర్‌ రూంను సైతం బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సైరన్‌ మోగడంతో బ్యాంకు అధికారులు అప్రమత్తమై గ్రామంలో ఉండే అటెండర్‌కి సమాచారం ఇచ్చారు. సైరన్‌ మోగడంతో దుండగులు అప్పటికే పారిపోయారు. అటెండర్‌ వచ్చి చూసే వరకు అక్కడ ఎవరూ లేరు. మేనేజర్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సాయిరాం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-22T04:31:29+05:30 IST