బీజేపీ కార్యకర్తలపై దాడులు దుర్మార్గమైన చర్య
ABN , First Publish Date - 2021-05-06T04:32:32+05:30 IST
పశ్చిమబెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ కార్యకర్తలు దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని దుబ్బాక, మిరుదొడ్డి మండలాల బీజేపీ అధ్యక్షులు అరిగే కృష్ణ, ఎలుముల దేవరాజు మండిపడ్డారు.

టీఎంసీపై బీజేపీ నేతల మండిపాటు
దుబ్బాక/మిరుదొడ్డి, మే 5: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ కార్యకర్తలు దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని దుబ్బాక, మిరుదొడ్డి మండలాల బీజేపీ అధ్యక్షులు అరిగే కృష్ణ, ఎలుముల దేవరాజు మండిపడ్డారు. బుధవారం ఆయా మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే టీఎంసీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతిపాలన విధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌ఎన్ చారి, సుభా్‌షరెడ్డి, రాజిరెడ్డి, రోశయ్య, మల్లేశం, అమర్, రమేష్, ఎల్లం, సాయిగౌడ్, ఆశగౌడ్, బాలకిషన్, జ్ఞానేశ్వర్, రామ్‌రెడ్డి, రమేష్, రాజశేఖర్, భాస్కర్, సంజీవులు పాల్గొన్నారు.
దౌల్తాబాద్, రాయపోల్‌లో ప్లకార్డుల ప్రదర్శన
రాయపోల్: దౌల్తాబాద్, రాయపోల్ మండల కేంద్రాల్లో బీజేపీ నాయకులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కార్యక్రమాల్లో దౌల్తాబాద్, రాయపోల్ మండలాల బీజేపీ అధ్యక్షులు పోతరాజు కిషన్, మాదాసు వెంకట్‌గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి యాదగిరి, నాయకులు కుమ్మరి నర్సింలు, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఎంసీ కార్యకర్తలను శిక్షించాలి
చిన్నకోడూరు: బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన టీఎంసీ కార్యకర్తలను వెంటనే శిక్షించాలని బీజేపీ మండలాధ్యక్షుడు పిట్ల పరశురాములు కోరారు. మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎర్రవెల్లి రాజిరెడ్డి, నాయకులు ముచ్చర్ల నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి మాతంగి నాగరాజు, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు మడూరి రవీందర్ పాల్గొన్నారు.
దాడి చేయడం సరికాదు
సిద్దిపేట రూరల్: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ నాయకులపై దాడి చేయడం సరికాదని ఆ పార్టీ నాయకులు సిద్దిపేట రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుటు నిరసన చేపట్టారు. అనంతరం కార్యాలయం సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేశారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ పార్టీ గూండాలు చేస్తున్న హత్యలను అరికట్టాలని, టీఎంసీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని, కోరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోత్కూ నరే్‌షకుమార్, అప్పయ్యగారి రవీందర్‌రెడ్డి, బీజేవైఎం రూరల్ మండల ఉపాధ్యక్షులు దూలం హేమంత్‌గౌడ్, జాని, లాలూ ప్రసాద్ పాల్గొన్నారు.