ముట్టడికి ముందే అరెస్టులు
ABN , First Publish Date - 2021-10-30T04:24:53+05:30 IST
అక్రమ అరెస్టులు సరికాదని బీజేపీ జిల్లా, మండల నాయకులు అన్నారు. కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం తగదన్నారు.
కలెక్టరేట్‌కు వెళ్లకుండా బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
గజ్వేల్, అక్టోబరు 29: అక్రమ అరెస్టులు సరికాదని బీజేపీ జిల్లా, మండల నాయకులు అన్నారు. కలెక్టరేట్ ముట్టడికి వెళ్లకుండా బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం తగదన్నారు. వరి వేస్తే ఉరేనంటూ రైతులను భయబ్రాంతులకు గురిచేసేలా కలెక్టర్ వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. కలెక్టర్ వ్యవహారశైలికి నిరసనగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ముట్టడికి వెళ్లకుండా నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. గజ్వేల్‌లో బీజేపీ, బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మనోహర్‌యాదవ్, పట్టణాధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడారు. కేంద్రం ధాన్యాన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్రంలో కొనుగోలు చేయబోమని సీఎం కేసీఆర్, మంత్రులు ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. అరెస్టయిన వారిలో జిల్లా కార్యదర్శి కుడిక్యాల రాములు, బండారు మహేష్, ఆంజనేయులు, సురేష్, శ్రీనివా్‌సరెడ్డి, టౌన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మర్కంట్టి ఏగొండ ఉన్నారు.
ఆయా మండలాల్లో
చిన్నకోడూరు: బీజేపీ మండలాధ్యక్షుడు పిట్ల పరశురాములు, మండల నాయకులను అరెస్టు చేసి చిన్నకోడూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు నాగరాజు, సంతోష్, జిల్లా అధికార ప్రతినిధి భూమేష్, జిల్లా ఆఫీస్ ఇన్‌చార్జి వెంకటేశం, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, రూరల్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, అర్బన్ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, అక్కనపేట మండలాధ్యక్షుడు వీరాచారి, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి శ్రీనివాస్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నంగునూరు మండల బీజేవైఎం అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, అక్కనపేట మండల బీజేవైఎం అధ్యక్షుడు కార్తీక్, చిన్నకోడూరు మండల మోర్చా ప్రధాన కార్యదర్శి రాకేష్, ఉపాధ్యక్షుడు అజయ్, నాయకులు నాగరాజు, శ్రీనివాస్, నరేష్, సత్యనారాయణ, కృష్ణ, అనిల్, చిన్నకోడూరు మండల ప్రధాన కార్యదర్శులు మాతంగి నాగరాజు, అక్కి సంతోష్, జిల్లా అఽధికార ప్రతినిధి మెరుగు భూమేష్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు అజయ్‌లు ఉన్నారు.
హుస్నాబాద్: పట్టణంలోని బీజేపీ నాయకులు దొడ్డి శ్రీనివాస్, బత్తుల శంకర్‌బాబు, మ్యాదరబోయిన వేణు, చెక్కబండి విద్యాసాగర్, కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, సతీష్, బద్దిపడగ జైపాల్‌రెడ్డిలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
చేర్యాల: చేర్యాల, కొమురవెల్లి మండలాల బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీ్‌సస్టేషన్‌లకు తరలించారు.
కోహెడ: మండలంలో అరెస్టయినవారిలో బీజేపీ మండలాధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం, సర్పంచ్ మ్యాకాల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ ధ్యాగటి సురేందర్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్ల శ్రీనివాస్, బీజేవైఎం మండలాధ్యక్షుడు కంది సత్యనారాయణరెడ్డి, ఓబీసీమోర్చా మండలాధ్యక్షుడు కక్కర్ల దామోదర్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి ముంజ శివసాయి, మండల ఉపాధ్యక్షులు హరీష్, ఎడమల రమణారెడ్డి ఉన్నారు.
దుబ్బాక/మిరుదొడ్డి: దుబ్బాకలో బీజేపీ రాష్ట్ర నాయకులు అంబటిబాలే్‌షగౌడ్‌ను హౌజ్ అరెస్టు చేశారు. సుభా్‌షరెడ్డి, మట్ట మల్లారెడ్డి, మచ్చ శ్రీనివాస్, ఎంగారి రాజిరెడి, భూపాల్‌లను పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర నాయకులు ఎస్‌ఎన్‌చారి, బోయరాజశేఖర్‌ను సిద్దిపేట రాజగోపాల్‌పేట పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మండలాధ్యక్షుడు అరిగె కృష్ణను భూంపల్లి పోలీ్‌సస్టేషన్‌కు, జిల్లా ఉపాధ్యాక్షులు మల్లేశం, శ్రీనివా్‌సరెడ్డి, రమే్‌షగౌడ్, మిరుదొడ్డి నాయకులను మిరుదొడ్డి, భూంపల్లి పోలీ్‌సస్టేషన్‌లకు తరలించారు.