ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-08-26T03:55:57+05:30 IST

పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన ఘటన హవేళిఘణాపూర్‌ మండలంలోని వాడిలో బుధవారం సాయంత్రం జరిగింది.

ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్టు

4 బైక్‌లు, నగదు సీజ్‌

హవేళిఘణాపూర్‌, ఆగస్టు 25: పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన ఘటన హవేళిఘణాపూర్‌ మండలంలోని వాడిలో బుధవారం సాయంత్రం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు వాడి గ్రామ శివారులో గుట్టుగా పేకాడుతున్న సమాచారం మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడి చేసి ఆరుగురుని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో ఓ ప్రజాప్రతినిధితో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నేతలున్నట్లు తెలిసింది. వారి వద్ద నాలుగు బైక్‌లు, రూ. 27 వేల నగదు, 6 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై హవేళిఘణాపూర్‌ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డిని వివరణ కోరగా పేకాటరాయుళ్లపై టాస్క్‌ఫోర్స్‌ కేసు నమోదు చేసిందని, ఆ సమాచారం చెప్పడానికి వీలు లేదన్నారు. కానీ ఆరుగురితో పాటు సీజ్‌ చేసిన వస్తువులను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిసింది. రాజకీయ ఒత్తిడి వల్లనే వివరాలు వెళ్లడించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - 2021-08-26T03:55:57+05:30 IST