మట్కా నిర్వాహకుల అరెస్టు

ABN , First Publish Date - 2021-10-20T04:16:18+05:30 IST

సదాశివపేటలోని మోమిన్‌పేట చౌరస్తా వద్ద గల అన్వర్‌ పాన్‌ షాప్‌లో మట్కా నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ గూడూరు సంతో్‌షకుమార్‌ తెలిపారు.

మట్కా నిర్వాహకుల అరెస్టు

సదాశివపేట అక్టోబరు 19: సదాశివపేటలోని మోమిన్‌పేట చౌరస్తా వద్ద గల అన్వర్‌ పాన్‌ షాప్‌లో మట్కా నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ గూడూరు సంతో్‌షకుమార్‌ తెలిపారు. మట్కా నిర్వహిస్తున్న ఎండీ మస్తాన్‌, ఎండీ అన్వర్‌, ఎండీ రబ్బానీ, ఎం. సంగమేశ్వర్‌, ఎ.లింగంను అదుపులోకి తీసుకుని 5 మొబైల్‌ఫోన్లు, మట్కా చిట్టీలు, రూ.14,150 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.  

Updated Date - 2021-10-20T04:16:18+05:30 IST