పొద్దుతిరుగుడు విత్తనాలేవి?
ABN , First Publish Date - 2021-12-19T05:20:28+05:30 IST
వరికి బదులు ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు సాగు చేద్దామంటే విత్తనాలు దొరకడం లేదని మండలంలోని కూచన్‌పల్లి రైతులు తలారి కిష్టయ్య, వెంకట్, నారాయణ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు.
విత్తనాలు దొరకనప్పుడు ప్రచారం ఎందుకు?
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
హవేళిఘణపూర్; డిసెంబరు 18: వరికి బదులు ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు సాగు చేద్దామంటే విత్తనాలు దొరకడం లేదని మండలంలోని కూచన్‌పల్లి రైతులు తలారి కిష్టయ్య, వెంకట్, నారాయణ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. దుక్కులు దున్ని సిద్ధం చేసుకొని, పొద్దుతిరుగుడు విత్తనాల కోసం అధికారులు, విత్తన విక్రయ దుకాణాల చుట్టూ తిరిగినా దొరకడం లేదన్నారు. విత్తనాలే అందుబాటులో లేనప్పుడు వరి పంటకు బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు గ్రామాల్లో ఎందుకు అవగాహన కల్పిసున్నారని ప్రశ్నించారు. విత్తనాలు దొరకనప్పుడు విసృత ప్రచారం ఎందుకన్నారు. అధికారులు కల్పించుకుని తమకు పొద్దుతిరుగుడు విత్తనాలు అందించేలా కృషి చేయాలని కోరారు.