స్వయం ఉపాధి శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
ABN , First Publish Date - 2021-11-27T04:54:43+05:30 IST
స్వయం ఉపాధితోపాటు ఉద్యోగావకాశాల కోసం శిక్షణ పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని ఐకేపీ ఏపీఎం టిక్యానాయక్, జేఆర్‌పీ సురేఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నారాయణఖేడ్, నవంబరు 26: స్వయం ఉపాధితోపాటు ఉద్యోగావకాశాల కోసం శిక్షణ పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని ఐకేపీ ఏపీఎం టిక్యానాయక్, జేఆర్‌పీ సురేఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, టెన్త్, ఎనిమిదో తరగతి చదివిన వారి కోసం అసిస్టెంట్, ఎలక్ట్రీషన్, సూపర్ స్ట్రక్చర్, అసిస్టెంట్ సర్వేయర్, సాధారణ, అసిస్టెంట్ ప్లంబర్, పేయింటింగ్, డెకరేషన్ కోర్సులలో శిక్షణ పొందడం కోసం ఆసక్తి గల వారు ఈనెల 27న ఉదయం 11 గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని సీఎల్‌ఆర్సీ భవనంలో సంప్రదించాలని కోరారు. ఎంపికైన వారికి హైదరాబాద్‌లోని జాతీయ కన్‌స్ట్రక్షన్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. పూర్తి వివరాల కోసం 9100044591 నంబరులో సంప్రదించాలన్నారు.