గ్రామాల్లో అంగన్‌వాడీ సేవలు భేష్‌

ABN , First Publish Date - 2021-02-25T05:28:13+05:30 IST

గ్రామాల్లో అంగన్‌వాడీ ఉద్యోగుల సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు.

గ్రామాల్లో అంగన్‌వాడీ సేవలు భేష్‌
అంగన్‌వాడీ టీచర్లకు చీరలను అందజేస్తున్న ఎమ్మెల్యే

 ఎమ్మెల్యే మాణిక్‌రావు


జహీరాబాద్‌, ఫిబ్రవరి 24: గ్రామాల్లో అంగన్‌వాడీ ఉద్యోగుల సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. బుధవారం పట్టణంలోని అల్లీపూర్‌లో గల ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో పనిచేసే అంగన్‌వాడీ టీచర్లకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్‌వాడీ సెంటర్ల పనితీరు అందరూ మెచ్చేలా ఉండాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యం విషయంలో సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్‌ విజయకుమార్‌, సీడీపీవో బ్రహ్మాజీ, ఏసీడీపీవో సుజనీ, సూపర్‌వైజర్లు సునీత, సునీతాబాయి, సంతోషి, అంజమ్మ, సిబ్బంది ప్రకాష్‌ పాల్గొన్నారు. అనంతరం మొగుడంపల్లి మండలం మాడ్గి, గొడిగార్‌పల్లి, ధనసిరి, ఇప్పపల్లి, ఖావజామాల్‌పూర్‌, మన్నాపూర్‌ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.


Updated Date - 2021-02-25T05:28:13+05:30 IST