నర్సాపూర్, పోచారం పార్కును సందర్శించిన అమెరికా బృందం
ABN , First Publish Date - 2021-10-26T05:12:48+05:30 IST
మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్‌పార్కును, హవేళీఘణపూర్ మండల పరిధిలోని పోచారం అభయారణ్య వనవిజ్ఞాన కేంద్రాన్ని సోమవారం అమెరికా ప్రతినిధుల బృందం సందర్శించింది.

నర్సాపూర్/హవేళీఘణపూర్ అక్టోబరు25: మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్‌పార్కును, హవేళీఘణపూర్ మండల పరిధిలోని పోచారం అభయారణ్య వనవిజ్ఞాన కేంద్రాన్ని సోమవారం అమెరికా ప్రతినిధుల బృందం సందర్శించింది. అమెరికాకు చెందిన యునైటెడ్‌స్టేట్స్ ఏజెన్సీస్ ఇంటర్నేషనల్ డెవల్‌పమెంట్ ఆధ్వర్యంలో డిప్యూటీ అసిస్టెంట్ అడ్మినిస్టేటర్ బ్యూరో ఆఫ్ ఆసియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాల్‌మెంట్ అండ్ క్లైమెట్ చేంజ్ వారితో నియమించిన ఐదుగురు సభ్యులతో కూడిన యూఎ్‌సఐడీ బృందం సభ్యులు సందర్శించారు. బృందంలో యూఎస్‌ఏఐడీ బ్యూరో ఫర్ ఆసియా అంజలికుమార్, మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి, సీనియర్ ఫారెస్ర్టీ అడ్వైజర్ వర్గీస్‌పాల్, ప్రొగ్రాం ఆఫీసర్ ఎలైన్, తదితరులు ఉన్నారు. నర్సాపూర్ పార్కులో ఏర్పాటు చేసిన మొక్కలతో పాటు ఇతర సదుపాయాలపై వారు సంతోషం వ్యక్తం చేశారు. హరితహారంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంతో పాటు ఇతర అటవీ సంబంధిత అంశాలను రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి లోకే్‌ష జైష్వాల్, సీసీఎఫ్ శర్వానంద్ పార్కులో స్టాల్ ఏర్పాటు చేసి బృందానికి వివరించారు. పార్కులో ఏర్పాటు చేసిన వాచ్‌టవర్‌పైకి ఎక్కి బృందం సభ్యులు అడవి అందాలను తిలకించారు. అలాగే పోచారం పార్కును సందర్శించి పర్యావరణం, అటవీ పెంపకం తదితర అంశాలపై అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సభ్యులకు గిరిజన సంస్కృతీ సాంప్రదాయ వస్త్రధారణలో గిరిజన మహిళలు నృత్యాలతో స్వాగతం పలికారు. సీనియర్ ఫారెస్ట్ అడ్వైజర్ వర్గీ్‌సపాల్ పోచారం అభయారణ్యంలో ఉన్న జంతువులు, వనవిజ్ఞాన కేంద్రంలో ఉన్న వివిధ ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం సీతాఫలాలను బృందం సభ్యులు పరిశీలించారు. అటవీ ప్రాంతంలో ఉండే మొక్కలు, జంతువుల వివరాలను తెలుసుకున్నారు. అడవి ద్వారా ప్రజలకు ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయి. ఇందుకు ప్రజల సహకారం ఏంటి. సుస్థిర నిర్వహణ ద్వారా అటవీ అభివృద్ధి తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరివెంట డెలిగాట్స్ చీఫ్ ఆఫ్ పార్టీ డాక్టర్ ఉజ్వల్ ప్రధాన్, డిప్యూటీ చీఫ్ అశి్‌షరాజ్, రీజినల్ డైరెక్టర్ సాయిలు, జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్, అటవీ క్షేత్ర అధికారి అంబర్‌సింగ్ ప్రొగ్రాం ఆఫీసర్ అలియాన్లీ, సీసీఎఫ్ శర్వానన్, డీఎ్‌ఫవో రవిప్రసాద్, అటవీ సిబ్బంది ఉన్నారు.