భగవద్గీత పారాయణంతో సకల శుభాలు

ABN , First Publish Date - 2021-12-27T04:38:38+05:30 IST

భగవద్గీత పారాయణంతో సకల శుభాలు కలుగుతాయని తొగుట రాంపూర్‌ పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామి అన్నారు.

భగవద్గీత పారాయణంతో సకల శుభాలు
మిరుదొడ్డిలో భగవద్గీత పారాయణంలో భాగంగా ప్రత్యేక పూజలను చేస్తున్న మాధవనంద సరస్వతి

తొగుట రాంపూర్‌ పీఠాధిపతి మాధవనంద సరస్వతి 


మిరుదొడ్డి, డిసెంబరు26: భగవద్గీత పారాయణంతో సకల శుభాలు కలుగుతాయని తొగుట రాంపూర్‌ పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామి అన్నారు. ఆదివారం మిరుదొడ్డిలోని  ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో చిన్మయమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత పారాయణంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వరూపం సుదర్శనలో యాగంలో భాగంగా శ్రీ మహావిష్ణువు విగ్రహానికి 108 కిలోలతో పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు.  కార్యక్రమంలో వేదపండితులు రాజపున్నయ్య శర్మ, చంద్రశేఖరశర్మ, చిన్మయ మిషన్‌ సభ్యులు నర్సింహులు, బాల్‌రాజు, రవి, భాస్కర్‌, వీరేశంగౌడ్‌ తదితరులున్నారు. 

Updated Date - 2021-12-27T04:38:38+05:30 IST