ఏడుపాయల జాతరకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

ABN , First Publish Date - 2021-02-05T05:37:09+05:30 IST

మాఘ అమావాస్య, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వన దుర్గామాత దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ రామకృష్ణారావు పేర్కొన్నారు.

ఏడుపాయల జాతరకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
ఏడుపాయల ఆలయ ఆవరణలో పర్యవేక్షిస్తున్న రామకృష్ణారావు, శ్రీనివాస్‌ తదితరులు

 దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ రామకృష్ణారావు


పాపన్నపేట, ఫిబ్రవరి 4 : మాఘ అమావాస్య, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వన దుర్గామాత దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ రామకృష్ణారావు పేర్కొన్నారు. గురువారం మెదక్‌ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్‌ కృష్ణతో కలిసి ఏడుపాయలకు వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం వన దుర్గామాత ఆలయ పరిసర ప్రాంతాలను తిరిగి పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు, స్నాన ఘట్టాలు, తాగునీటి సౌకర్యం, విద్యుత్‌ దీపాల ఏర్పాటుపై ఆలయ ఈవో సార శ్రీనివాస్‌తో చర్చించారు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈవోకు సూచించారు. వీరి వెంట సిబ్బంది తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-02-05T05:37:09+05:30 IST