అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా.. రైతు మృతి

ABN , First Publish Date - 2021-11-01T04:38:47+05:30 IST

ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడి ఓ యువరైతు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం అక్కన్నపేట మండలం కేశవాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా.. రైతు మృతి

 అక్కన్నపేట, అక్టోబరు 31: ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడి ఓ యువరైతు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం అక్కన్నపేట మండలం కేశవాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవాపూర్‌ గ్రామానికి చెందిన యువరైతు జెట్టి భాస్కర్‌(26) తన వ్యవసాయ భూమిలో మట్టిని పోసేందుకు తన ట్రాక్టర్‌ను నడుపుకుంటూ గ్రామంలోని గిద్దకుంట చెరువు కట్ట పైనుంచి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రగాయాలైన భాస్కర్‌ను సమీపంలోని రైతులు హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. భాస్కర్‌కు భార్య లావణ్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య జెట్టి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొత్తపల్లి రవి తెలిపారు.


 

Updated Date - 2021-11-01T04:38:47+05:30 IST