రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-05-19T05:25:21+05:30 IST

కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే కఠినంగా వ్యవహరించనున్నట్టు జిల్లా డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు హెచ్చరించారు.

రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు
మోతెలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు

డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు

మిరుదొడ్డి,మే18: కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే కఠినంగా వ్యవహరించనున్నట్టు జిల్లా డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మోతె గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు వచ్చి మద్దతు ధరను పొందాలని సూచించారు. ఆయన వెంట గ్రామ సర్పంచు వంజరి శ్రీనివాస్‌, సీసీ ప్రభాకర్‌ తదితరులున్నారు. 


హుస్నాబాద్‌ డివిజన్‌లో 6.70లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు: ఆర్డీవో

హుస్నాబాద్‌, మే 18: హుస్నాబాద్‌ డివిజన్‌లో ధాన్యం కోనుగోళ్లు త్వరలో ముగియనున్నట్టు ఆర్డీవో జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హుస్నాబాద్‌లోని బస్‌డిపో పక్కన గ్రౌండ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎస్పీ సందెపోగు మహేందర్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ.. డివిజన్‌లో ఇప్పటి వరకు 6.70లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు.  రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ అయ్యాయని తెలిపారు. 


రైతులు అపమ్రత్తంగా ఉండాలి 

మద్దూరు, మే 18:  వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు నరేందర్‌ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని సలాఖ్‌పూర్‌, లద్నూరు, మర్మాముల, ధర్మారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్‌ నాగిళ్ల తిరుపతిరెడ్డితో కల్సి సందర్శించి రైతులకు పలు సూచనలు చేశారు.    


కొనుగోళ్లను వేగవంతం చేయాలి

చిన్నకోడూరు, మే 18: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఎంపీడీవో శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం మండలంలోని మాచాపూర్‌, మైలా రం, చౌడారం, మేడిపల్లి, ఇబ్రహీంనగర్‌లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. మండలంలోని ఓబులాపూర్‌ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఏం మహిపాల్‌ మంగళవారం పరిశీలించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 92,668 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు.  

రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు 

రాయపోల్‌, మే 18: ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో నిర్వాహకులు రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ రాజయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన అనాజీపూర్‌, మంతూరు, రాయపోల్‌, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.   

Updated Date - 2021-05-19T05:25:21+05:30 IST